Header Banner

ప్రపంచ చరిత్రపై సమగ్ర గ్రంథం! దగ్గుబాటి రచనను అభినందించిన మాజీ ఉపరాష్ట్రపతి!

  Thu Mar 06, 2025 13:33        Politics

తెలుగులో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పుస్తకం రాయడం వెనుక ఉన్న అన్ని విషయాలను దగ్గుబాటి వివరించారని, ఈ తరం యువత దీన్ని చదివి అనేక విషయాలు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. జ్ఞానం, విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారని, అయితే ప్రపంచ చరిత్రను పుస్తకంగా అందించడం అంత తేలికైన విషయం కాదని అన్నారు. ఎన్టీఆర్ నటన గురించి పూర్తి స్థాయిలో పుస్తకాన్ని రాయడం ఎంత కష్టమో, ప్రపంచ చరిత్రను సరళమైన భాషలో అందించడం కూడా అంతే క్లిష్టమని అభిప్రాయపడ్డారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేసి అందించడం గొప్ప విషయం అని, వివిధ సంఘటనలు ఎలా మారాయో చరిత్ర చెబుతుందన్నారు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, మానవ సమాజంలోని అన్ని అంశాలను చరిత్ర వివరిస్తుందని, మన గుర్తింపుకు చరిత్ర ఒక పునాదిగా మారుతుందని వివరించారు. చరిత్రను అర్థం చేసుకుని భవిష్యత్తులో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, దాన్ని సరిగా నమోదు చేయడం చాలా కీలకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశ చరిత్ర వక్రీకరణకు గురైందని, ప్రపంచ చరిత్ర గురించి రాసిన దగ్గుబాటి భవిష్యత్తులో భారత చరిత్రను కూడా రాయాలని ఆకాంక్షించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #books #daggubati #publishing #todaynews #flashnews #latestnews